Guru Transit: కోట్లు కురిపించనున్న గురువు.. ధనవర్షంతో తడిసిపోయే మూడు రాశులు..!
Guru Transit Lucky Zodiac Signs: మన జాతకంలో గురు బలం బాగుంటే అన్ని రంగాల్లో రాణిస్తారు. ఈ నేపథ్యంలో గురు అనుగ్రహం వల్ల మూడు రాశులు ధనవర్షం ప్రాప్తిస్తుంది.

Guru Transit: కోట్లు కురిపించనున్న గురువు.. ధనవర్షంతో తడిసిపోయే మూడు రాశులు..!
Guru Transit Lucky Zodiac Signs: జాతకంలో ప్రతి గ్రహం శుభంగా ఉంటే జాతక దోషాలు లేకుండా ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. అయితే గ్రహాలలో గురుబలం అధికంగా ఉంటే వ్యాపారాలు విస్తరిస్తాయి. అంతేకాదు పదోన్నతి పని ప్రదేశంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. అయితే బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు. ఈ నేపథ్యంలో రానున్న మే నెలలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మూడు రాశులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది.
ప్రధానంగా గురువు అంటేనే విద్య, జ్ఞానం, వివాహం, పిల్లలు, వృత్తికి సంబంధించింది. గురు అనుగ్రహం వల్ల నక్కతోక తొక్కే రాశులు ఏమో తెలుసుకుందాం.
తులారాశి..
గురు అనుగ్రహం వల్ల తులా రాశి వారికి జీవితంలో కోరుకున్నది ప్రతిదీ లభిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకు ఆర్థిక లాభాలు పెరుగుతాయి. పెళ్లి వారికి కానీ వారికి త్వరగా పెళ్లి కూడా యోగం ఉంది. జీవితంలో పురోగతి సాధిస్తారు ముందుకు దూసుకు వెళ్తారు.
మిథున రాశి ..
మిథున రాశి వారికి కూడా జీవితంలో ప్రతిదీ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారంలో బాగా లాభాలు కలిసి వస్తాయి. అంతేకాదు వీళ్ళు పదోన్నతి పొందే సమయం కూడా. ఈ సమయంలో వీళ్ళు ఏది ప్రారంభించిన విజయపథంలో దూసుకుపోతుంది. కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు.
వృషభ రాశి ..
వృషభ రాశి వారికి కూడా గురు అనుగ్రహం వల్ల అశేష యోగాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. జీవితంలో కోరుకున్నది సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించిన విజయపథంలో దూసుకుపోతోంది. అంతేకాదు ఆఫీస్ పనుల్లో కూడా మంచి పురోగతి లభిస్తుంది. దీంతో వీళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)