Ram Navami 2025: పెళ్లికాని వారు శ్రీరామనవమి రోజు ఈ చిన్నపని చేస్తే.. త్వరలో పెళ్లి ఖాయం..!
Ram Navami 2025 Remedy: పెళ్లి కాని వారు శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే త్వరలోనే పెళ్లి ఖాయం అవుతుందని పండితులు చెబుతున్నారు.. శ్రీరామ నవమి పండుగను అత్యంత వేడుకగా హిందువులు జరుపుకుంటారు.
Ram Navami 2025: పెళ్లికాని వారు శ్రీరామనవమి రోజు ఈ చిన్నపని చేస్తే.. త్వరలో పెళ్లి ఖాయం..!
Ram Navami 2025 Remedy: సీతారాముల కళ్యాణం చైత్ర మాసంలో శుక్లపక్షం తొమ్మిదవ రోజున అంటే నవమి రోజున ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఉగాది నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఆరోజుల్లో వచ్చే నవమి రోజున శ్రీరామనవమి జరుపుతారు. అంటే ఆ రోజు సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. వీరు ఆదర్శ దంపతులు.
ప్రధాన ఆలయాలతోపాటు ఊరువాడా సీతారాముల కల్యాణం జరుపుతారు. అంగరంగ వైభవంగా పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా ఈ పండుగ జరుపుతారు. . శ్రీరాముడు ఉత్తమ పురుషుడు ఆయన అయోధ్య దశరథ మహారాజు కౌసల్యలకు పుట్టిన పుత్రుడు. ఎప్పుడూ సత్యాన్ని అనుసరించేవాడు. ఏకపతివ్రతుడు. ప్రతి ఏడాది మన దేశంలో సీతారాముల కళ్యాణం జరుపుతాం. అయితే ఆరోజు చిన్న పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు పెళ్లి కాని వారికి కూడా పెళ్లి ఖాయం అవుతుంది.
శ్రీరామనవమి ఏప్రిల్ 6 ఆదివారం రోజు నిర్వహిస్తారు. దీనికి శుభ సమయం అంటే నవమి తిథి ఏప్రిల్ 5 సాయంత్రం 7 :26 నిమిషాల నుంచి మరుసటి రోజు ఏప్రిల్ 6 సాయంత్రం 7 :22 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో సీతారాముల వివాహం జరిపిస్తారు.
అయితే శ్రీరామ నవమి రోజు ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి పూజలు వంటివి చేస్తారు. సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుని విగ్రహాలకు మంచి అభిషేకం చేసి అలంకరిస్తారు. ఆరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం ఆనవాయితీ. అంతేకాదు శ్రీరామనవమి రోజు పాణకం ప్రసాదంగా ఇస్తారు.
ఇక పెళ్లి కాని వారు శ్రీరామనవమి రోజు ఒక చిన్న పని చేయాలి. వివాహం ఆలస్యమైన వారు సీతమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గంధం సమర్పిస్తే వారికి త్వరలో పెళ్లి ఖాయం అవుతుంది. ఇలా చేయటం వల్ల సంపద, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఎందుకంటే సీతమ్మ లక్ష్మీ ప్రతిరూపమని అంటారు. అంతేకాదు హనుమాన్ దేవాలయాలకు వెళ్లి హనుమాన్ చాలీసా కూడా పాటించడం ఎంతో ముఖ్యం.