Ugadi 2025 Libra Horoscope: తుల రాశికి అద్బుతం.. డబ్బు, బంగారం కంటే విలువైంది ఈ ఏడాది..

Ugadi 2025 Libra Horoscope: ఈ రాశి వారికి ప్రధాన గ్రహాల అనుకూలతలు సామాన్యంగానే ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఒకట్రెండు నెలలు మామూలుగా సాగుతుంది.

Update: 2025-03-30 01:00 GMT
Ugadi 2025 Libra Horoscope

Ugadi 2025 Libra Horoscope: తుల రాశికి అద్బుతం.. డబ్బు, బంగారం కంటే విలువైంది ఈ ఏడాది..

  • whatsapp icon

ఆదాయం-11

వ్యయం- 5

రాజపూజ్యత- 2

అవమానం-2

Ugadi 2025 Libra Horoscope: ఈ రాశి వారికి ప్రధాన గ్రహాల అనుకూలతలు సామాన్యంగానే ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఒకట్రెండు నెలలు మామూలుగా సాగుతుంది. ఆ తర్వాత, కొన్ని ఆటంకాలు వచ్చినా, సమయస్ఫూర్తి, పట్టుదలలు ప్రదర్శించి, పనులను పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికీ ఇదే రీతిగా ఉంటుంది. వీలైనంత మేర ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం మంచిది కాదు. అదృష్టం పడుతుందనో, ఎవరో సహకరిస్తారనో ఆశలు పెట్టుకోవడం, ఊహాగానాల్లో విహరించడం మానుకోవాలి. అతి విశ్వాసం అసలే పనికిరాదు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.

కుటుంబ వ్యవహారాలు మీరు భావించినట్లే సజావుగా సాగుతాయి. సంతానం అభివృద్ధిలోకి రావడం సంతోషాన్ని పెంచుతుంది. ఆర్థిక స్థితిని సమతుల్యం చేసుకుంటారు. వివాహాది శుభ కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం అనుకూలిస్తుంది. గృహ నిర్మాణానికి అవసరమైన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొంటారు. వాహనయోగం ఉంది. మీ పురోభివృద్ధికి.. బంధువులు, రక్త సంబంధీకుల కన్నా, మిత్రులే ఎక్కువగా సహకరిస్తారు. రుణ విముక్తి ప్రయత్నాలూ సఫలమవుతాయి. గౌరవం లభిస్తుంది.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ప్రమోషన్లు, ఆర్థికవృద్ధి ఆశించిన రీతిలోనే ఉంటుంది. ప్రైవేటు రంగంలో పనిచేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మానసిక ఆందోళనలు తలెత్తినా, తట్టుకుని నిలుస్తారు. తోటి ఉద్యోగులతో తరచూ భేదాభిప్రాయాలు, కలహాలు సూచిస్తున్నాయి. వీలైనమేర వీటిని పరిష్కరించుకోండి. ఇక, ప్రభుత్వోద్యోగులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలకు జాప్యం అనివార్యంగా కనిపిస్తోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, అక్కడి మిత్రుల సహకారంతో కలిసి వస్తాయి. స్థూలంగా, ప్రైవేటు రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వ్యాపారులకు ఈ సంవత్సరం సాధారణ లాభాలే ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన సానుకూలతలు కనిపించడం లేదు. కొత్త పెట్టుబడులు లేదా విస్తరణ ప్రయత్నాల కోసం, శక్తి మించి రుణాలు తీసుకోవడం శ్రేయస్కరం కాదు. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన వ్యాపారాలు, చేతివృత్తులను నమ్మి వ్యాపారం చేసేవారికి, రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలకూ, కొత్త కాంట్రాక్టులను తీసుకోవడానికి కూడా అనువుగా లేదు. రియల్టర్లు, షేర్ మార్కెట్‌లలోని వారికి అనుకూలంగా ఉంటుంది.

రాజకీయ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. ఇప్పటికే పదవుల్లో కొనసాగుతున్న వారు, మరింత మెరుగైన పదవిని పొందుతారు. ప్రజాక్షేత్రంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత, మీ ప్రాంత సమస్యల పరిష్కారానికి చేసే కృషి ఫలిస్తుంది.

విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ప్రణాళికల ప్రకారం అధ్యయనం చేస్తే, నిర్దేశించుకున్న ఫలితాలను పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ర్యాంకుల సాధనకు అనువుగా ఉంది. దూర విద్య, విదేశీ విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి.

ఈరాశి వారు నిత్యం దుర్గామాత అష్టోత్తరాన్ని పఠించడం, లేదా అమ్మవారి నామాన్ని స్మరించడం మంచిది. వేంకటేశ్వరస్వామి దర్శనం, గోవిందనామాల స్మరణ కూడా మేలు చేస్తాయి.

Tags:    

Similar News