Ugadi 2025: ఉగాది రాశిఫలాలు 2025-26.. సింహరాశి వారికి ఒక్క గండం గడిస్తే అదృష్టం తన్నుకు రావడం ఖాయం..

Ugadi 2025 Leo Horoscope: సింహరాశి జాతకులపై అష్టమ శని ప్రభావం ఉంది. గురుడు కూడా సామాన్య ఫలదాత. కాబట్టి, ప్రతి పనినీ ఇష్టపూర్వకంగా చేపట్టాల్సి ఉంటుంది.

Update: 2025-03-30 00:30 GMT

Ugadi 2025: ఉగాది రాశిఫలాలు 2025-26.. సింహరాశి వారికి ఒక్క గండం గడిస్తే అదృష్టం తన్నుకు రావడం ఖాయం..

ఆదాయం-11

వ్యయం- 11

రాజపూజ్యత-3

అవమానం- 6

Ugadi 2025 Leo Horoscope: సింహరాశి జాతకులపై అష్టమ శని ప్రభావం ఉంది. గురుడు కూడా సామాన్య ఫలదాత. కాబట్టి, ప్రతి పనినీ ఇష్టపూర్వకంగా చేపట్టాల్సి ఉంటుంది. ఎవరో వచ్చి ఏదో చేసేస్తారన్న భ్రమలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు మాత్రం తృప్తిగానే సాగుతాయి. సంతానం వృద్ధిలోకి రావడం ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఒడుదుడుకులు ఉంటాయి. మానసిక దృఢత్వాన్ని కోల్పోకుండా శ్రమిస్తే, నిలదొక్కుకోగలుగుతారు. ఆయా గ్రహాల స్థితి, గతుల కారణంగా, మనసు నిలకడగా ఉండదు. అనవసరంగా ఆందోళనలు కలుగుతుంటాయి.

శని గోచారస్థితి కారణంగా, పనులకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో తరచూ చికాకులు ఏర్పడుతుంటాయి. సంయమనంతో అన్నింటినీ సరిదిద్దాల్సి ఉంటుంది. వివాహాది శుభ కార్యాలు ఆశించినట్లుగానే జరుగుతాయి. గృహ నిర్మాణం, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలపై దృష్టి పెడతారు. తాహతుకు మించి రుణం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. వాహనయోగం ఉంది. ఆరోగ్య విషయంగా అనుకోని ఖర్చులు వస్తాయి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి, ఈ సంవత్సరం విశేషమైన మార్పులేమీ ఉండవు. పైగా అనూహ్యమైన భయాందోళనలు వెంటాడతాయి. ఇష్టంలేని ప్రాంతానికి లేదా విభాగానికి బదిలీ అయ్యే సూచన ఉంది. ఆర్థికంగా సంతోషకరంగా ఉన్నా, పని చేస్తున్న ప్రదేశం నచ్చక ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించిన విధంగానే బదిలీలు, ప్రమోషన్లు కలిసివస్తాయి. ఉన్నతాధికారులో సఖ్యత చెడుతుంది. ఫలితంగా పని చేసే చోట ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. విదేశీ ఉద్యోగాల్లో ఆటంకాలు విపరీతంగా ఉంటాయి. అయితే, సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలకు అక్కడి మిత్రులు సహకరిస్తారు. అయినా, ఈ ప్రయత్నాలు ఎంతో ఎదురు చూపు తర్వాతే ఫలిస్తాయి.

వ్యాపారులకు ఆశించిన విధంగానే లాభాలుంటాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, ప్రస్తుత వ్యాపార విస్తరణకు అనుకూల కాలం కాదు. భాగస్వామ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తప్పనిసరైన ఖర్చుల కారణంగా, అనుకోని ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. డబ్బుని చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడాలి. అప్పులు చేయక తప్పని పరిస్థితి గోచరిస్తోంది. చేతి వృత్తులు అవలంబించే వారికి పనులు బాగానే ఉన్నా.. ఆశించినంత మిగులు ఉండదు. కులవృత్తులను ఆచరించే వారికి విశేష లాభముంటుంది. స్పెక్యులేషన్స్ అనుకూలించవు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లోని వారికి సామాన్య ఫలితాలుంటాయి.

రాజకీయ రంగాల్లోని వారు, అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత స్థాయి వారి నుంచి ఆశించిన సహకారం లభించదు. రాజకీయాలపై విరక్తి కలిగే సూచనలూ ఉన్నాయి. ప్రజాజీవితంలో ఆటుపోట్లను సహనంతో ఎదుర్కొంటేనే చక్కటి భవిష్యత్తు అని గుర్తించి కష్టపడాలి. లక్ష్యాలను చేరుకునే మార్గాలను అనుసరించాలి.

విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అయితే దీనికి విశేష శ్రమ అవసరం. ఈ ఏడాది సింహరాశి విద్యార్థుల్లో మతిమరపు అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఆశించిన స్థాయి ఫలితాలను పొందలేరు. సాధారణ పరీక్షల్లో కొద్దిపాటి శ్రద్ధ చూపితే, ముందంజలో ఉంటారు. బద్ధకం, నిర్లక్ష్యం కారణంగా, ఎన్నో మంచి అవకాశాలను కోల్పోతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి.

ఈరాశి వారు నిత్యం గణపతి స్తోత్ర పఠనం, హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా మానసిక శాంతిని పొందగలుగుతారు. అష్టమ శని స్థితి వల్ల తలెత్తే చికాకులు తొలగించుకునేందుకు, తరచూ.. నువ్వుల నూనెతో శనైశ్చరుడిని అభిషేకించడం మంచిది.

Tags:    

Similar News