Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (26/3/2025)

Daily Horoscope Today In Telugu, March 26, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-26 00:30 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, March 26, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం

తిధి: ద్వాదశి అర్ధరాత్రి దాటాక గం.1.42 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి

నక్షత్రం: ధనిష్ట అర్ధరాత్రి దాటాక తె.వా.గం.2.30 ని.ల వరకు ఆ తర్వాత శతభిషం

అమృతఘడియలు: సాయంత్రం గం.4.40 ని.ల నుంచి గం.6.11 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.7.36 ని.ల నుంచి గం.9.07 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.11.57 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.46 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.30 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.16 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.28 ని.లకు

మేషం :

శుభవార్తలను వింటారు. పనులు చకచకా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. తోటివారి నుంచి తగినంత సహకారం లభిస్తుంది. ఆనందంగా గడుపుతారు. అభీష్టం నెరవేరుతుంది. సంతాన విషయాలు తృప్తినిస్తాయి.

వృషభం :

ఇష్టసిద్ధి ఉంది. సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మేలిమి అవకాశాలు కలిసివస్తాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధ సహకారం అందుతుంది.

మిథునం :

పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రత్యర్థులకు మీ బలహీనతే ఆయుధం అవుతుంది. మనశ్శాంతిని కోల్పోతారు.

కర్కాటకం:

అనుకున్న రీతిలో పనులు సాగవు. ఉద్రేకం కలుగుతుంది. ఎదుటివారిపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. బుద్ధి నిలకడ లేక, బాధ్యతలు సరిగా నిర్వర్తించక అధికారులతో చివాట్లు తింటారు. తలనొప్పి వేధిస్తుంది.

సింహం :

అభీష్టం నెరవేరుతుంది. స్వేచ్ఛ విలువ తెలిసివస్తుంది. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. విందులో పాల్గొంటారు.

కన్య :

మాట చెల్లుబాటు అవుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కీర్తి పెరుగుతుంది. బంధువులతో విందుకు హాజరవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది.

తుల :

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యాలు ఒడుదుడుకులుగా సాగుతాయి. సంతాన సంబంధ వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మిత్రులు సహకరిస్తారు. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త.

వృశ్చికం :

ఆలోచనలు చెడు మార్గంలోకి వెళ్లకుండా నియంత్రించుకోవాలి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి మిత్రులూ అందుబాటులో ఉండరు. ఆస్తి విక్రయాల్లో నష్టపోతారు. జాగ్రత్త.

ధనుస్సు :

ముఖ్యమైన సమాచారం ఆనందపెడుతుంది. బంధాలు బలపడతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. సోదరులు అండగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మశాంతి ఉంటుంది.

మకరం :

ఇతరుల కారణంగా ఇబ్బంది పడే సూచన ఉంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఆర్థిక లావాదేవీ ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఎవరికీ పూచీకత్తులు ఇవ్వకండి. నిందలొస్తాయి.

కుంభం :

అన్ని పనులూ సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. పైస్థాయికి ఎదిగేందుకు సహచరుల తోడ్పాటు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఉత్సాహంగా గడుపుతారు.

మీనం :

ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. ఇతరులతో కలిసి చేసే వ్యవహారాల్లో జాగ్రత్త. విరోధం ఏర్పడే సూచన ఉంది. వృథా ఖర్చులను తగ్గించాలి. ఆత్మీయుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

Tags:    

Similar News