Surya Grahanam 2025: మరో 24 గంటల్లో షష్టగ్రహకూటమి, సూర్య గ్రహణం .. ఈ 3 రాశులకు వెయ్యికోట్లు లాభం..
Surya Grahanam 2025 Lucky Zodiac: రేపు శని అమావాస్య ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం అది కాకుండా శని దేవుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది కాకుండా షష్ఠగ్రహ కూటమి కారణంగా మూడు రాశులకు లక్కీ కాలం. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేసుకోండి..

Surya Grahanam 2025: మరో 24 గంటల్లో షష్టగ్రహకూటమి, సూర్య గ్రహణం .. ఈ 3 రాశులకు వెయ్యికోట్లు లాభం..
Surya Grahanam 2025 Lucky Zodiac: చంద్రగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు షష్ట గ్రహ కూటమి, సూర్యగ్రహణం ఏర్పడనుంది. శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని, మీనరాశిలో కలవబోతున్నారు. అందుకే ప్రధానంగా ఈ కాలంలో ప్రకృతి వైపరీత్యాలు కూడా దారితీస్తుందని ప్రముఖులు చెబుతున్నారు.
సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కొన్ని దేశాల్లో సంపూర్ణంగా.. మరికొన్ని దేశాల్లో పాక్షికంగా కనిపించనుంది. ఈ సూర్య గ్రహణం, షష్టగ్రహ కూటమి వల్ల కర్కాటక, మీనరాశి వారికి ఈ శని మార్పు వల్ల అదృష్టం వరిస్తుంది. మార్చి 29 సూర్యగ్రహణం 2 :14 నిమిషాల నుంచి సాయంత్రం 6 తర్వాత ముగుస్తుంది. ఓకే రాశిలో ఇన్ని గ్రహాలు ఉండటం షష్ఠగ్రహ కూటమి, సూర్య గ్రహణంతో రాశులపై ప్రభావం పడుతుంది.
మేష రాశి..
మేష రాశి వారికి కాస్త ఒడిదుడుకు తప్పవు. ఈ రాశివారికి ఇబ్బందులు తప్పవు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సుదూరం ప్రాంతాలకు వెళ్లకపోవడమే మేలు. చిన్న సమస్యలు కూడా ప్రమాదాలు పెంచుతాయి. మేష రాశివారు రేపు ఎర్ర పప్పును దానం చేయడం మంచిది. శివుని అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
వృషభ రాశి ..
వృషభ రాశి వారి కూడా ఆచితూచి మాట్లాడాలి. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందాలంటే కాస్త ఓపిగ్గా ఉండాలి. వ్యాపారంలో వృద్ధి సంపాదించాలి కాస్త కష్టపడితే ఫలితం లభిస్తుంది. ఈ రాశివారు గాయత్రి మంత్రాన్ని జపిస్తే మంచిది.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ఇది వీరికి మంచి సమయమే.. ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో భాగస్వామి మద్ధతు లభిస్తుంది. జీవితంలో పైకి ఎదిగే సదవకాశం లభిస్తుంది. తెల్ల వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి ..
సింహ రాశి వారికి ప్రస్తుత సమయం కాస్త గందరగోళం కల్పిస్తుంది. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మేలు. అయితే, మన దేశంలో సూర్యగ్రహణం ప్రభావం కనిపించదు. అందుకే సూతకం కూడా చెల్లదు. శని రాశి మార్పు వల్ల కొన్ని రాశులకు శుభం కలిగితే.. మరికొన్ని రాశులకు అశుభం అని చెప్పొచ్చు.