Shani Gochar 2025: శని రాశి మార్చగానే ఈ 2 రాశులకు ధైయ నుంచి విముక్తి.. నక్కతోక తొక్కారంటే నమ్మండి..!
Shani Gochar Lucky Zodiac Signs: శని రాశి మారినప్పుడు కొంత మందికి శని దశతో అశుభం కలుగుతుంది.. మరికొంత మందికి శుభాలు కలుగుతాయి.

Shani Gochar 2025: శని రాశి మార్చగానే ఈ 2 రాశులకు ధైయ నుంచి విముక్తి.. నక్కతోక తొక్కారంటే నమ్మండి..!
Shani Gochar Lucky Zodiac Signs: మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశించగానే రెండు రాశులకు అదృష్టం వరిస్తుంది. వీరికి శని ధైయ నుంచి విముక్తి కలుగుతుంది. ఈ నేపథ్యంలో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరి అభివృద్ధికి అడ్డే ఉండదు.. శని ధైయ విముక్తి కలగబోతున్న రాశులు ఏమో తెలుసుకుందాం.
శని కర్మలను బట్టి ఫలితాలు అందిస్తాడు. ఈ నేపథ్యంలో శని దేవుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో వృశ్చిక కర్కాటక రాశిలో వారికి శని ధైయ నుంచి విముక్తి కలుగుతుంది. వీరికి లాభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి మీన రాశిలోకి శని సంచారం వల్ల శని ధైయ నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది. దీంతో వీరు బంపర్ ప్రయోజనాలు పొందుతారు. లగ్జరీ లైఫ్ వీరి సొంతమవుతుంది. పట్టిందల్లా బంగారమే. ఏ పని మొదలుపెట్టిన ఆటంకాలు ఉండవు. విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చే సమయం.
కొత్త పనులు చేపడతారు.. స్థిరాస్తులు ఈ ఏడాదిలో కొనుగోలు చేసే అవకాశం మెండుగా ఉంది. అంతేకాదు వీరికి ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
వృశ్చిక రాశి..
శని ధైయ నుంచి విముక్తి పొందే మరో రాశి. ఈ రాశి వారికి శని సంచారం వల్ల మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాదు విదేశీ యోగం కలిసి వస్తుంది. శత్రువుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ప్రధానంగా కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఈ ఏడాది పెళ్లికూడా జరగని వారికి పెళ్లి యోగం ఉంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.. భాగస్వామి మద్దతుతో ముందుకు సాగుతారు.
అయితే శని ధైయ నుంచి పూర్తిగా విముక్తి పొందాలంటే సుందరకాండ పారాయణం, శని చాలీసా ప్రతి శనివారం పారాయణం చేయాలి. దీంతో వీరికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. శనివారం ఇనుము, నల్ల బట్టలు దానం చేయడం వల్ల కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకంగా శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలి. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి.