Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (27/3/2025)

Daily Horoscope Today In Telugu, March 27, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-27 00:30 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, March 27, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం

తిధి: త్రయోదశి రాత్రి గం.11.03 ని.ల వరకు ఆ తర్వాత చతుర్దశి

నక్షత్రం: శతభిషం అర్ధరాత్రి గం.12.34 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర

అమృతఘడియలు: సాయంత్రం గం.5.56 ని.ల నుంచి గం.7.25 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.07 ని.ల నుంచి గం.10.35 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.10.19 ని.ల నుంచి గం.11.08 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.13 ని.ల నుంచి గం.4.02 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి గం.3.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.15 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.28 ని.లకు

మేషం 

వ్యవహార లాభముంది. చేపట్టిన ప్రతి పనీ సఫలం అవుతుంది. శుభకార్యాచరణల్లో పాల్గొంటారు. మిత్రులతో సరదాగా గడుపుతారు. పోటీలలో విజేతలుగా నిలుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధనలాభం ఉంది.

వృషభం 

యత్నకార్యం సిద్ధిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి మేలిమి ఫలితాలు లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం 

అవసరానికి తగినంత డబ్బు అందుతుంది. పనులకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. మనసు నిలకడగా ఉండదు. సంతానం తీరును విభేదిస్తారు. దూర ప్రయాణం ఉంది. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు.

కర్కాటకం

పట్టుదలకు పోయి పోటీల్లో పాల్గొంటే నష్టపోతారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అనుకున్న రీతిలో పనులు సాగవు. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మనశ్శాంతి ఉండదు

సింహం 

ఉల్లాసంగా గడుస్తుంది. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారంతో.. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. కొత్త సంగతులు తెలుస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ప్రయాణం లాభిస్తుంది.

కన్య 

శుభ ఫలితాలను పొందుతారు. ధనలాభముంది. నూతన వస్తువులను కొంటారు. బంధువులతో సఖ్యత వృద్ధి చెందుతుంది. అపార్థాలు తొలగుతాయి. శత్రుపీడ తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది.

తుల 

పనులకు అవరోధాలు ఎదురవుతాయి. వ్యవహార నష్టం వల్ల మనసు కలత చెందుతుంది. తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. అనవసర గొడవల్లో ఇరుక్కుంటారు.విలువైన వస్తువులు దొంగలపాలయ్యే సూచన ఉంది.

వృశ్చికం 

ఆలోచనలను నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆత్మీయులకు దూరమవుతారు. వృథా ఖర్చులు, అవమానాలు కలవరపెడతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. స్థిరాస్తి లావాదేవీలు లాభించవు.

ధనుస్సు 

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అన్ని వైపుల నుంచీ తగిన సహకారం లభిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. అవసరానికి సోదరులు తోడుంటారు. మనశ్శాంతి లభిస్తుంది.

మకరం 

అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల అవమాన పడే అవకాశాలున్నాయి. పనులు కూడా అనుకున్న రీతిలో సాగవు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెంచాలి. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. మనశ్శాంతి కరువవుతుంది.

కుంభం 

అభీష్టం నెరవేరుతుంది. ఉన్నత స్థితి కోసం చేసే ప్రయత్నాలకు పెద్దల మద్దతు లభిస్తుంది. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. బాల్యస్నేహితులను కలుస్తారు.

మీనం 

అనవసర ప్రయాణాలను మానుకోండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. వేళకు భోజనం ఉండదు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. మనసు నిలకడగా ఉండదు.

Tags:    

Similar News