Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (24/3/2025)
Daily Horoscope Today In Telugu, March 24, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 24, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం
తిధి: దశమి రేపు తె.వా. గం.5.05 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ రేపు తె.వా. గం.4.27 ని.ల వరకు ఆ తర్వాత శ్రవణము
అమృతఘడియలు: రాత్రి గం.10.00 ని.ల నుంచి గం.11.37 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.12.21 ని.ల నుంచి గం.1.57 ని.ల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.47 ని.ల నుంచి గం.1.36 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.13 ని.ల నుంచి గం.4.02 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.7.30 ని.ల నుంచి గం.9.00 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.17 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 6.28 ని.లకు
మేషం
కార్యాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులు, వృత్తిపర నైపుణ్యం ప్రదర్శిస్తారు. ప్రశంసలు పొందుతారు. అధికారవృద్ధి గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. విందుకు హాజరవుతారు.
వృషభం
న్యాయపరమైన చిక్కులు వచ్చే వీలుంది. జాగ్రత్తగా నడచుకోండి. ఉద్యోగులు బాధ్యతగా నడచుకోవాలి. అశాంతి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ప్రయాణం వాయిదా వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.
మిథునం
కార్యసాధనలో కష్టాలుంటాయి. అనుకున్న రీతిలో పనులు సాగక అశాంతికి గురవుతారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. తగాదాలకు ఆస్కారముంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. వాత సమస్య బాధిస్తుంది.
కర్కాటకం
భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి శుభవార్త గోచరిస్తోంది. విందుకు వెళతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
సింహం
కీలక వ్యవహారంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. కార్యాలు లాభసాటిగా ముగుస్తాయి. ధనలాభం ఉంటుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. పోటీల్లో గెలుస్తారు. న్యాయ వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
కన్య
చెడు ఆలోచనలను అదుపు చేయాలి. కార్యసాధనలో ఇబ్బందులుంటాయి. అనుమానాలు, భయాలు చుట్టు ముడతాయి. విజ్ఞతను కోల్పోకండి. సంతాన సంబంధ చికాకులు ఉంటాయి. వృథా ఖర్చులను తగ్గించాలి.
తుల
కార్యసాధనలో మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో నష్టాలు గోచరిస్తున్నాయి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. బద్ధకం వద్దు.
వృశ్చికం
స్వయంకృషితో కార్యాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. ప్రియమైన వ్యక్తులను కలుస్తారు. సోదరుల వ్యవహారాలను చక్కదిద్దుతారు. కీలక సమాచారం అందుతుంది. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది.
ధనుస్సు
మాట నిలుపుకోని కారణంగా ఇబ్బంది వస్తుంది. అవమానం ఎదురవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇతరుల వల్ల సమస్యలు వస్తాయి. ఇతరులతో ఆచితూచి మాట్లాడండి. ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు.
మకరం
కార్య నిర్వహణలో సమర్థంగా వ్యవహరిస్తారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు అందుతాయి. సహచరులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
కుంభం
వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. బద్ధకం వల్ల ఉద్యోగులకి ఇబ్బంది వస్తుంది. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. అనవసర జోక్యం మంచిది కాదు.
మీనం
ఆకాంక్ష నెరవేరుతుంది. పనులు విజయవంతం అవుతాయి. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనశ్శాంతి లభిస్తుంది.