Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (25/3/2025)
Daily Horoscope Today In Telugu, March 25, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 25, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం
తిధి: ఏకాదశి అర్ధరాత్రి దాటాక తె.వా. గం.3.45 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి
నక్షత్రం: శ్రవణము రేపు తె.వా.గం.3.49 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ట
అమృతఘడియలు: సాయంత్రం గం.5.41 ని.ల నుంచి రాత్రి గం.7.15 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.8.20 ని.ల నుంచి గం.9.54 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.8.43 ని.ల నుంచి గం. 9.31 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.11 ని.ల నుంచి గం.11.58 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.16 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 6.28 ని.లకు
మేషం
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉన్నతస్థాయిలోని వారి అండ లభిస్తుంది.మనశ్శాంతి ఉంటుంది.
వృషభం
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది. న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. కొంత అశాంతి ఏర్పడుతుంది. పెద్దలను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
మిథునం
వారసత్వపు ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రావు. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. తగాదాలకు దూరంగా ఉండాలి. కోపాన్ని తగ్గించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
కర్కాటకం
స్వేచ్ఛాజీవితంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాలు బాగా ఉపకరిస్తాయి. బంధువులతో విందులకు హాజరవుతారు.
సింహం
వివాదాలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తొలగిపోవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను కొంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. శత్రుపీడ తగ్గిపోతుంది.
కన్య
సంతాన సంబంధ విషయాలపై శ్రద్ధ చూపాలి. ఆలోచనలను అదుపు చేసి, బాధ్యతల నిర్వహణపై శ్రద్ధ చూపాలి. ఆర్థిక ఒడుదుడుకులు ఉంటాయి. మీ తెలివితేటలకు అక్కరకు రావు. అనవసర జోక్యాలు వద్దు.
తుల
సమర్థించే వారే ప్రత్యర్థులుగా మారే సూచన ఉంది. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసరాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం
సంబంధాలు వృద్ధి చెందుతాయి. నైపుణ్యంతో పెద్దలను ఆకట్టుకుంటారు. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. కీలక వ్యవహాంలో సోదరులు తోడ్పాటు లభిస్తుంది.
ధనుస్సు
కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. అకారణ విరోధం ఏర్పడుతుంది. మనసుకి కష్టంగా ఉంటుంది. వేళకు భోజనముండదు. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది.
మకరం
ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యవహారాలన్నీ విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. స్నేహితులతో వినోదంగా గడుపుతారు. ప్రయాణం లాభిస్తుంది
కుంభం
కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం గోచరిస్తోంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. మనసు నిలకడగా ఉండదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి
మీనం
అన్ని రకాలుగా లబ్దిని పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చక్కటి సౌకర్యాలను పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.