Shani Effect: శనిదేవుడి వల్ల ఈ 2 రాశులు నక్కతోక తొక్కబోతున్నారు.. ఇందులో మీ రాశి ఉందా?
Shani Effect Lucky Zodiac Signs: ఈనెల తర్వాత కొన్ని రాశులకు శనిదేవుడి శుభ దృష్టి పడునుంది. ఈనేపథ్యంలో వారు ఆర్థికంగా లాభాలు గడిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది.

Shani Effect: శనిదేవుడి వల్ల ఈ 2 రాశులు నక్కతోక తొక్కబోతున్నారు.. ఇందులో మీ రాశి ఉందా?
Shani Effect Lucky Zodiac Signs: ఈ నెలలో 29వ తేదీ శనిదేవుడు రాశి మారనున్నాడు. ఈ సందర్భంగా వృషభ, తుల రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు బాగా పెరుగుతాయి. అంతేకాదు వ్యాపారంలో కూడా వృద్ధి చూస్తారు. శని శుభ దృష్టి ఉంటే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితాలు కూడా లభిస్తాయి.
వృషభ రాశి..
శనిదేవుడి ఆశీర్వాదం వల్ల వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల నుంచి ఏ పని చేసినా విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. ప్రధానంగా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అంతేకాదు విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయత్నాలు మొదలు పెడితే కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
తుల రాశి..
శని దేవుడి వల్ల తుల రాశి వారికి కూడా విశేష యోగాలు కలుగుతాయి. వీరు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు. చేపట్టిన పనుల్లో విజయం తథ్యం. అంతేకాదు దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కాస్త పెద్దల నుంచి సూచనలు తీసుకుంటే వీరికి ఏప్రిల్ తర్వాత తిరుగే ఉండదు. శనిదేవుడి వల్ల శ్రీ విశ్వావసునామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది.
శని దేవుడి శుభ దృష్టి వల్ల ఈ రెండు రాశులవారు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాదు ఈ రాశులు ఏప్రిల్ తర్వాత ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంది. శని దేవుడి వల్ల రుణ బాధలు, రోగాలు కూడా తొలగిపోతాయి. ప్రతి శనివారం వేంకటేశ్వరస్వామి పూజ చేస్తే కూడా శని బాధలు వదిలిపోతాయి. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాలి. స్వామివారిని దర్శించుకోవడం వల్ల శని బాధలు వదిలిపోతాయని పండితులు చెబుతారు. ఈ నెల 30వ తేదీ ఉగాది పండుగ జరుపుకోనున్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా నామకరణం చేశారు.