Lunar Eclipse 2024: హోలీరోజే చంద్రగ్రహణం.. ఎవరిపై ఎఫెక్ట్‌ పడనుంది..!

Lunar Eclipse 2024: ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది.

Update: 2024-03-21 08:30 GMT

Lunar Eclipse 2024: హోలీరోజే చంద్రగ్రహణం.. ఎవరిపై ఎఫెక్ట్‌ పడనుంది..!

Lunar Eclipse 2024: ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది. వాస్తవానికి 1924లో హోలీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే 25 మార్చి 2024 సోమవారం ఏర్పడనుంది. చంద్రగ్రహణం ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:02 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్‌ పడుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి 2024 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్ర గ్రహణం ఇదే. ఈ సమయంలో రాహువు కన్య రాశిలో ఉంటాడు. అయితే ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు. గ్రహణం అర్ధరాత్రి 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. ఉత్తర, తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. కానీ మన దేశంలో కనిపించదు.

హోలీ పండుగపై చంద్రగ్రహణం ఎలాంటి నెగటివ్‌ ఎఫెక్ట్‌ చూపించదు. హాయిగా హోలీ పండుగ జరుపుకోవచ్చు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం హోలీ రోజున వస్తుంది కాబట్టి కొన్ని రాశుల వారికి శుభప్రదం అని చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేయనవసరం లేదు.

Tags:    

Similar News