Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (21/3/2025)
Daily Horoscope Today In Telugu, March 21, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 21, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం
తిధి: సప్తమి రేపు తె.వా. గం.4.23 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి
నక్షత్రం: జ్యేష్ట అర్ధరాత్రి దాటాక గం.1.46 ని.ల వరకు ఆ తర్వాత మూల
అమృతఘడియలు: సాయంత్రం గం.4.08 ని.ల నుంచి గం.5.53 ని.ల వరకు
వర్జ్యం: సూర్యోదయం తర్వాత లేదు
దుర్ముహూర్తం: ఉదయం గం.8.45 ని.ల నుంచి గం.9.34 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం.1.36 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.10.30 ని.ల నుంచి గం.12.00 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.19 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం. 6.27 ని.లకు
మేషం
వ్యవహారాల్లో పంతాలు, పట్టింపులు మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. తగాదాలు వద్దు. ప్రత్యర్థులు బలపడతారు. వారసత్వపు ఆస్తి వ్యవహారాల్లో జాప్యం తప్పదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
వృషభం
ఆకాంక్ష నెరవేరుతుంది. వ్యవహారాలన్నీ మీరు ఆశించినరీతిలోనే సాగుతాయి. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థికలబ్దిని పొందుతారు. బంధాలు బలపడతాయి.
మిథునం
అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అపార్థాలు, వివాదాలు తొలగిపోతాయి. ధనలాభం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రులతో వినోదంగా గడుపుతారు. పోటీల్లో విజేతలవుతారు.
కర్కాటకం
వ్యవహారాలు అనుకున్నరీతిలో సాగవు. ఇష్టకార్యం నెరవేరదు. ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే ఉంటాయి. సమర్థత, తెలివితేటకు సరైన గుర్తింపు ఉండదు. సంతానం తీరును విభేదిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
సింహం
బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం గొచరిస్తోంది. కీలక కార్యం చెడిపోతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించవు. ఆరోగ్యం జాగ్రత్త. వాహన సంబంధ సమస్య ఉంటుంది.
కన్య
కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అవసరమైన సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక కమ్యూనికేషన్ అందుతుంది. సోదరులతో సఖ్యత ఉంటుంది.
తుల
ముందుచూపు లేని పనుల వల్ల సమస్యలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగవు. కుటుంబ విషయాలపై శ్రద్ధ కనబరచాలి. ఆస్తి వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది.
వృశ్చికం
అదృష్టం తోడుగా ఉంటుంది. అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు
అనూహ్య ఖర్చులు వస్తాయి. అప్పు చేయాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం మంచిది కాదు. అనవసరంగా పోటీలకు దిగకండి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది.
మకరం
రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. గృహోపకరణాలను కొంటారు. సంతాన సంబంధ ఆకాంక్ష నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.
కుంభం
ప్రయత్నించిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. సమర్థతకు తగ్గ గౌరవాన్ని పొందుతారు. బంధువులతో వినోదంగా గడుపుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.
మీనం
పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. బద్ధకం వల్ల ఇబ్బంది వస్తుంది. సహచరులతో గొడవలు వద్దు. దూర ప్రయాణం గోచరిస్తోంది. సంతానం తీరును వ్యతిరేకిస్తారు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.