Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (20/3/2025)

Daily Horoscope Today In Telugu, March 20, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-20 00:30 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, March 20, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం

తిధి: షష్ఠి అర్ధరాత్రి దాటాక గం.2.45 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: అనూరాధ రాత్రి గం.11.31 ని.ల వరకు ఆ తర్వాత జ్యేష్ట

అమృతఘడియలు: ఉదయం గం.11.57 ని.ల నుంచి మధ్యాహ్నం గం.1.44 ని.ల వరకు

వర్జ్యం: రేపు సూర్యోదయానికి ముందు తె.వా. గం.5.39 ని.ల నుంచి ఉదయం గం.7.24 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.10.23 ని.ల నుంచి గం.11.11 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.13 ని.ల నుంచి గం.4.02 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి గం.3.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.20 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.27 ని.లకు

మేషం 

సదుపాయాలు ఆశించిన రీతిలో సమకూరవు. నిరాశ చెందకుండా కష్టపడాలి. గొడవలకు ఆస్కారముంది. తొందరపాటు నిర్ణయాలు, మాట తూలడం వంటివి వద్దు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభం 

బంధుమిత్రులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. సంతాన విషయాలు తృప్తికరంగా ఉంటాయి.

మిథునం 

ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. బంధువుల సహకారంతో కీలక వ్యవహారాన్ని శుభప్రదంగా పూర్తి చేస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం ఉంది.

కర్కాటకం

సంతానం తీరు చికాకు పెడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు ఆస్కారముంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. శిక్షణ కార్యక్రమాలూ ఆశించిన ఫలితమివ్వవు. విలువైన వస్తువులు భద్రం.

సింహం 

వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. మానసిక ఒత్తిడి ఉంటుంది. డబ్బుకి సంబంధించి మాట నిలుపుకోలేక పోతారు. స్థిరాస్తి రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ విషయాలపై శ్రద్ధను కనబరచాలి.

కన్య 

సహచరుల తోడ్పాటుతో లక్ష్యాన్ని చేరుకుంటారు. నాయకత్వ పటిమకు ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు.

తుల 

ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. వృథా ఖర్చులను తగ్గించాలి. కంటికి సంబంధించిన సమస్య ఉంటుంది.

వృశ్చికం 

తెలివితేటలకు చక్కటి ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది. ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ఆశించిన లబ్ది అందుతుంది.

ధనుస్సు 

పనులు అనుకున్నరీతిలో సాగవు. ఒత్తిడి ఎక్కువవుతుంది. బంధువులతో విరోధం గోచరిస్తోంది. నిర్లక్ష్య ధోరణి వల్ల సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

మకరం 

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇష్టపడిన వస్తువులను సొంతం చేసుకుంటారు. చిక్కుల్లో ఉన్నవారికి సహకరిస్తారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం 

ఉన్నత పదవిలోని వారి అండ లభిస్తుంది. కార్యాలు సజావుగా సాగుతాయి. తండ్రి సామాజిక స్థితిగతులు మెరుగవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోరిక నెరవేరుతుంది.

మీనం 

కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. దూర ప్రయాణం ఉంది. అయినవారితోనే విభేదాలు తలెత్తుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉన్నత విద్యాయత్నాలు అనుకూలించవు. కీళ్ల సంబంధ సమస్య ఉంటుంది.

Tags:    

Similar News