YSRCP MP donation to Ayodya Ram temple: అయోధ్య రామమందిర నిర్మాణానికి వైసీపీ ఎంపీ భారీ విరాళం!
YSRCP MP donation to Ayodya Ram temple: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పేరు రఘురామ కృష్ణంరాజు .. నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా లేవనెత్తి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
YSRCP MP donation to Ayodya Ram temple: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పేరు రఘురామ కృష్ణంరాజు .. నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా లేవనెత్తి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు.. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి గాను ఉడతా భక్తిగా తన మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.
ఈ మేరకు ఆయన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర చైర్మన్‌కు లేఖ రాశారు. తన ట్వీట్ ని ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జోడించారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది హిందువులు ఈ ఆలయ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా అయోధ్య హిందువుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇక వచ్చే నెల ఆగస్టు 5వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే.. దీనికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే భూమి పూజ చేయనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణం కోసం చాలా మంది దాతలు భారీగానే విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.