YSR Village Clinics in AP: అన్ని పంచాయతీల్లో వైఎస్ఆర్ విలేజీ క్లినిక్స్

YSR village clinics in AP: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఏపీలోని అన్ని పంచాయతీల్లో గ్రామ క్లినిక్ లు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్మోహనరెడ్డి సంకల్పించారు.

Update: 2020-07-16 08:21 GMT
village clinics

YSR Village Clinics in AP: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఏపీలోని అన్ని పంచాయతీల్లో గ్రామ క్లినిక్ లు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్మోహనరెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో దాదాపుగా 13వేల క్లినిక్ లు ఏర్పాటు చేస్తామని, వాటిలో 54 రకాల మందులను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కరోనా విలయంలో సైతం దేశంలోనే పరీక్షలు, వైద్య సేవలందించడంలో ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో క్లినిక్ లను అందుబాటులోకి తేవడంలో మరో ముందడుగు వేసింది. గురువారం ఆయన ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు.

వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కారాదన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆయన ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంబిస్తూ మాట్లాడారు.వైద్యం కోసం ,ఆస్పత్రులను ఆదునీకరించేందుకుగాను 16వేల కోట్ల రూపాయల వ్యయం చేయడానికి ప్రభుత్వం సన్నద్దం అవుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రమాణాలు కలిగిన మందులు ఉండేలా చర్యలు తీసుకున్నామని జగన్ తెలిపారు.ఇంతకు ముందు 230 రకాల అత్యవసర మందులు ఉంటే, జనవరి నుంచి 500 రకాల మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణలు ఉన్నవాటిని అందుబాటులోకి తెస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామంలో ఎవరికి బాగోలేకపోయినా, విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి 13 వేల గ్రామ క్లినిక్ లను అందుబాటులోకి తెస్తామని , అక్కడ 54 రకాల మందులు కూడా అక్కడ ఉంటాయని ఆయన తెలిపారు.5 లక్షల ఆదాయం ఉన్నవారి వరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.కంటివెలుగు కింద 65 లక్ష మంది విద్యార్దులకు పరీక్షలు చేశామని జగన్ తెలిపారు. 

Tags:    

Similar News