ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారంభమైంది.సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ చేపట్టింది. లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.1421.20 కోట్లను విడుదల చేసింది. పెన్షన్ల పంపిణీలో 2,37,615 మంది వాలంటీర్లు నిమగ్నమయ్యారు.
కరోనా వైరస్ కారణంగా.. ఈసారి బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
పింఛన్ కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ మొదలై, తిరిగి సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు అందజేస్తారు. వాలటీర్ల వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రభుత్వం తెచ్చే పథకాల్ని లబ్దిదారులకు చేరవేయడంలో వాలంటీర్లు పనితీరు బాగుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి