ఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
Rajya Sabha Seat to R Krishnaiah: ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటాయ్.
Rajya Sabha Seat to R Krishnaiah: ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటాయ్. ఆయన ఏది చేసిన అందులో రాజకీయం కచ్చితంగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువైన జగన్ ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రం జపిస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపించేందుకు జగన్ సిద్ధమయ్యారు.
బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామంటున్న వైసీపీ ఆ వర్గాల్లో గుర్తింపు ఉన్న నేతకు కీలక పదవి ఇవ్వడంతో రాజకీయంగా తనకు ఇమేజ్, మైలేజ్ వస్తాయని భావిస్తున్నారు. ఐతే తెలంగాణ వ్యక్తికి ఏపీలో రాజ్యసభ సీటు ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆర్ కృష్ణయ్య, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న కృష్ణయ్య ఒక్కసారిగా వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపిక చేయడం సంచలనంగా మారింది.