తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉన్నారు.. అందుకే ఏపీలో వర్షాలు- వైసీపీ ఎంపీ
Vijaya Sai Reddy: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.ఏ ఎన్నికల్లో అయినా సొంతంగా గెలిచే సత్తా లేదనే విషయం చంద్రబాబుకు అర్థమయిందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క ఇటుకను కూడా పెట్టకుండానే అమరావతి గ్రాఫిక్స్ ను చూపిస్తూ చంద్రబాబు ఐదేళ్లు గడపేశారని విజయసాయి వ్యాఖ్యానించారు.
జగన్ మాత్రం తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్ల జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్ ను 15 రోజుల్లోనే పూర్తి చేశారని అన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకుడికి, పరాన్నజీవిలాంటి నాయుడికి ఇదే తేడా అని చెప్పారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రస్తుతం పక్క రాష్ట్రంలో ఉన్నారని... అందుకే ఏపీలో ఈసారి ముందే వర్షాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. వారిద్దరూ కరువుకు మారుపేరని అన్నారు.
చంద్రబాబు ఆయన తనయుడు మరో నాలుగు నెలల పాటు ఇక్కడకు రాకపోతే రుతుపవనాలు భారీ వర్షాలను కుమ్మరిస్తాయని చెప్పారు. 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు ఎలాంటి షరతులు లేకుండా ఇంకో పార్టీకి మద్దతిస్తానని ప్రాధేయపడటం ఎక్కడా జరిగి ఉండదని విమర్శించారు. ప్రజలు ఈసడించుకుంటున్నా, బాబుకు ఆశ చావడం లేదని విజయసాయి రెడ్డి అన్నారు.