నిమ్మగడ్డ పరిధి దాటి వ్యహరిస్తున్నారు -కాకాణి
*శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా నిమ్మగడ్డ చర్యలు -కాకాణి *ఎస్‌ఈసీ వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదులు స్వీకరించింది -కాకాణి *విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం -కాకాణి
ఎస్‌ఈసీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి గృహనిర్బంధంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నిమ్మగడ్డకు చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు. పరిధులు దాటి నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాకాణి హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా నిమ్మగడ్డ నిర్ణయాలు ఉంటున్నాయని దుయ్యబట్టారు కాకాణి. ఇప్పటికే ఎస్‌ఈసీ వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదులు స్వీకరించిందని, తగిన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కాకాణి.