ఏపీలో మొదలైన చలి గాలులు..

వర్షాల హోరు తగ్గింది. ఇక చలిగాలుల ప్రభావం మొదలైంది.

Update: 2020-10-31 01:42 GMT

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి..ఈశాన్య గాలులు మొదలయ్యాయి. దీంతో ఏపీలో చలి ప్రభావం మొదలైంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నిన్న ఆరోగ్యవారంలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటె.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రా తీరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో 4.5 కి.మీ. ఎత్తున కొనసాగుతోంది.

అలగే.. తూర్పు బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్రం ప్రాంతాల్లో 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Tags:    

Similar News