బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. ఏపీకి వర్షసూచన

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

Update: 2019-12-01 05:26 GMT

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. గ్రేటర్ రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది.

కనుక పిడుగులు పడే అవకాశం ఉండటంతో నిర్మానుష్య ప్రాంతాల్లో ఎవ్వరూ నిలబడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇదిలావుంటే గత మొద్దునెలల పాటు ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడు ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో శ్రీశైలం రిజర్వాయిర్ కు నీటి ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం జలాశయంలో 182 టీఎంసీల నీరు ఉంది. 

Tags:    

Similar News