విశాఖలో ఎగసిన ఉక్కు ఉద్యమజ్వాల

* కేంద్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన * ప్రైవేటీకరణ వద్దంటూ హెచ్చరికలు * విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అంటూ నినాదాలు

Update: 2021-02-06 03:08 GMT

 Steel Plant Movement

విశాఖలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ చేస్తే ఊరుకునేది లేదని కార్మికులు, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు కదలని నిర్ణయం తీసుకుంటున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారన్న సమాచారంతో సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు పూనుకున్నారు. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు వారికి వెన్నంటి నిలిచాయి. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయొద్దంటూ పలు సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అంటూ నినదించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయబోమని కార్మికులు తేల్చి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

Tags:    

Similar News