CPI Narayana: విశాఖ రుషికొండ సందర్శన కోసం హైకోర్టును ఆశ్రయించా

* ఇక్కడ సీఎం కార్యాలయం నిర్మించడం లేదు.. విలాసవంతమైన భవనాలు కడుతున్నారు

Update: 2022-11-25 08:33 GMT

విశాఖ రుషికొండ సందర్శన కోసం హైకోర్టును ఆశ్రయించా

CPI Narayana: విశాఖ జిల్లా రుషికొండ సందర్శన కోసం గత ఆగస్ట్ నెలలో హైకోర్టును ఆశ్రయించానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మూడు నెలలు పట్టినా తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. మళ్లీ కోర్టుకు వెళ్లడంతో తాను సందర్శించడానికి అనుమతిచ్చారని తెలిపారాయన దీంతో రుషికొండను సందర్శించానని చెప్పారు. ఇక్కడ సీఎం కార్యాలయం నిర్మించడం లేదని, కానీ విలాసవంతమైన భవనాలు కడుతున్నారన్నారు.

ప్రభుత్వ పెద్దలు పర్యావరణాన్ని హత్యాచారం చేశారని ఆరోపించారు విల్లాలను ఎక్కడైనా కట్టుకోవచ్చని అనకాపల్లిలో ఇతర చోట కట్టొచ్చన్నారు కానీ ప్రకృతిని నాశనం చేసిన పాపం మాత్రం ఊరికే పోదని హెచ్చరించారు కట్టడం చట్ట ప్రకారమే కానీ కొండను తొలిచేయడం నేరమని చెప్పారాయన ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల్లో అధికారులు కూడా రాత్రి బస చేసే అనుమతి లేదన్నారు. కేవలం పర్యాటకులు ఉండడానికి విల్లాలు మాత్రమే నిర్మిస్తున్నారని నారాయణ చెప్పారు.

Full View


Tags:    

Similar News