Sankalp Siddhi: విజయవాడ సంకల్ప సిద్ది స్కాం కేసులో పురోగతి

Sankalp Siddhi: స్కాంలో కీలకంగా వ్యవహరించిన కిరణ్ అరెస్ట్

Update: 2023-04-07 06:01 GMT

Sankalp Siddhi: విజయవాడ సంకల్ప సిద్ది స్కాం కేసులో పురోగతి

Sankalp Siddhi: విజయవాడ సంకల్ప సిద్ది స్కాం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్కాంలో కీలకంగా వ్యవహరించిన కిరణ్‌ను అరెస్ట్ చేశారు. సంస్థ డైరెక్టర్‌గా చక్రం తిప్పిన కిరణ్.. గతేడాది నవంబర్‌ నుంచి పరారీలో ఉన్నాడు. దీంతో కర్ణాటకలో కిరణ్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.300కోట్ల వరకు సంకల్ప సిద్ది మోసాలు చేసింది. ఇప్పటికే ఛైర్మన్ సహా ఐదుగురు అరెస్ట్ అయ్యారు. కిరణ్‌ ద్వారా కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News