నా రాజకీయ భవిష్యత్ జగన్ పెట్టిన భిక్షే.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన మంత్రి విడదల రజిని
Vidadala Rajini: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమ బహిరంగ సభలో రజిని భావోద్వేగం
Vidadala Rajini: చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే..ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్‌తో కలిసి విడదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రజిని ప్రసంగించారు. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షేనంటూ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ..భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు.