కొండపల్లి మున్సిపాలిటీలో ఊహించని ట్విస్ట్.. కీలకంగా మారిన ఎంపీ కేశినేని ఓటు..

Kondapalli Municipality: కొండపల్లి మున్సిపాలిటీలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

Update: 2021-11-17 14:01 GMT

కొండపల్లి మున్సిపాలిటీలో ఊహించని ట్విస్ట్.. కీలకంగా మారిన ఎంపీ కేశినేని ఓటు..

Kondapalli Municipality: కొండపల్లి మున్సిపాలిటీలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొండపల్లిలో 29 వార్డులకు గాను 14 స్థానాలు వైసీపీ, 14 స్థానాలు టీడీపీ గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలపొందారు.

అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీలక్ష్మి చేరికతో టీడీపీ బలం 15కు చేరింది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో వైసీపీకి మరో ఓటు పెరిగింది. అయితే చైర్మన్ ఎన్నికలో ఎంపీ కేశినేని ఓటుపై మాత్రం సందిగ్దత నెలకొంది. 15 రోజుల క్రితమే రిజిస్టర్ చేసుకోవాలని ఎంపీ కేశినేని నానిని కొండపల్లి మున్సిపల్ అధికారులు కోరినప్పటికీ కేశినేని నాని స్పందించలేదు. దీంతో ప్రస్తుతం నాని ఓటు చెల్లుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News