బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, హీరో సిద్ధార్థ్‌ మధ్య ట్వీట్‌ వార్

Tweet War: సిద్ధార్థ్‌ మూవీలకు దావూద్‌ డబ్బులు ఇస్తున్నాడన్న విష్ణువర్ధన్‌రెడ్డి

Update: 2021-05-07 05:33 GMT
హీరో సిద్దార్థ &విష్ణు వర్ధన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Tweet War: బీజేపీ నేతలపై సినీ హీరో సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తన కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు. తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా ఆయన టార్గెట్ చేశారు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చాడు. దీంతో సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా సిద్ధార్థ్ స్పందించాడు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని చెప్పాడు. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.




Full View


Tags:    

Similar News