TTD Trust Key decisions : తిరుమలలో ప్రతి ఉద్యోగికీ కరోనా పరీక్షల తరువాతే అనుమతి!
TTD Trust key decisions :ముగిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
TTD Trust Keyy decisions : ముగిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వచ్చే పాలకమండలి సమావేశాన్ని ఎస్వీబీసీలో లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదాయం కోసం భక్తుల సంఖ్యని పెంచామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు.
జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతించామని.. ఏ ఒక్క భక్తుడికి కూడా కరోనా పాజిటివ్ రాలేదనీ అన్నారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మస్కులను దరిస్తూ స్వామివారి దర్శనం ను చేసుకుంటున్నారు
గత వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అత్యవసర పాలకమండలి సమావేశం నిర్వహించింట్లు స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెంచాలా, వద్ద అనే అంశం పై సభ్యుల సూచనలు స్వీకరించమని సుబ్బారెడ్డి అన్నారు. పాలకమండలి సభ్యుల సూచన మేరకు కరోనా విజృంభిస్తుండడంతో తాజా పరిస్థితులలో భక్తుల సంఖ్య ను పెంచబోమనీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనాలు ప్రారంభమయిన గత 25 రోజులలో 17 మంది టీటీడీ ఉద్యోగులు, పూజారులు, సెక్యూరిటి సిబ్బందికీ కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ఉద్యోగుల్లో పాలకమండలి మనోధైర్యం నింపుతోందన్నారు. ఉద్యోగుల భద్రతపై చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ బాధ్యతను ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డికు అప్పగించారు. సీఎం సూచన మేరకు తిరుమలలోని కర్ణాటక సత్రాల కళ్యాణ మండపానికి అనుమతి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చామన్నారు. త్వరలో సత్రాలకు సంబంధించి కర్ణాటక సీఎం, ఏపీ సీఎం కలిసి శంకుస్థాపన చేస్తారన్నారు. 7.5 ఎకరాల కర్ణాటక ప్రభుత్వ భూమి లో రూ. 200 కోట్లతో అద్దె గదులు, కళ్యాణమండపం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తాం
కరోనా వైరస్ సోకిన టిటిడి ఉద్యోగులు వైద్య ఖర్చులన్ని టిటిడినే భరించాలని నిర్ణయించామని ఉద్యోగులకు టిటిడి అండగా ఉంటుందనీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. ఇక తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తామన్నారు. ఆర్జిత సేవలు ఇప్పట్లో నిర్వహించబోమని.. ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం సేవను భక్తులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. తిరుమల లో ఉన్న ప్రవైట్ గెస్ట్ హౌస్ కేటాయింపు లో పారదర్శకంగా బిడ్డింగ్ నిర్వహిస్తాం..అధిక డోనేషన్ ఇచ్చే దాతలకి తగిన ప్రాధాన్యత ఇస్తాంమని అన్నారు.