TTD: ఎలాంటి అపచారం జరగలేదు.. వదంతులు నమ్మొద్దు..

Tirumala Brahmotsavam: తిరుమలలో ధ్వజస్తంభం కొక్కి మార్పుపై భక్తులకు క్లారిటీ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం.

Update: 2024-10-04 13:37 GMT

TTD: ఎలాంటి అపచారం జరగలేదు.. వదంతులు నమ్మొద్దు..

Tirumala Brahmotsavam: తిరుమలలో ధ్వజస్తంభం కొక్కి మార్పుపై భక్తులకు క్లారిటీ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయి.

అయితే శ్రీవారి భక్తులు ఇలాంటి వదంతులు నమ్మొద్దని కోరింది టీటీడీ. బ్రహ్మోత్సవాల మునుపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం... ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి కొత్త వాటిని అమర్చడం సాధారణమే అని టీటీడీ తెలిపింది. అందులో భాగంగానే కొక్కిని కూడా మార్చినట్టు వెల్లడించింది. అంతలోనే ఏదో అపచారం జరిగినట్టు ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రసారం చేయడం దురదృష్టకరమంది టీటీడీ.

Tags:    

Similar News