TTD Chairman: కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక చేతికర్ర.. నిర్దేశిత సమయాల్లోనే కొండపైకి టూ వీలర్స్‌కు అనుమతి..

TTD Chairman: టీటీడీ హైలెవల్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2023-08-14 12:10 GMT

TTD Chairman: కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక చేతికర్ర.. నిర్దేశిత సమయాల్లోనే కొండపైకి టూ వీలర్స్‌కు అనుమతి..

TTD Chairman: టీటీడీ హైలెవల్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులపై చిరుత దాడుల ఘటనపై చర్చించామని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు. కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక ఊతకర్రను ఇవ్వనున్నాం. కర్రే ఇక భక్తులకు ప్రధాన ఆయుధం అని భూమన తెలిపారు. నడకదారిలో వైల్డ్‌ లైఫ్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. నడకదారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇకపై మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో పిల్లలకు అనుమతి లేదన్నారు. నిర్దేశిత సమయాల్లోనే కొండపైకి టూ వీలర్స్‌కు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వన్యప్రాణులకు భక్తులు ఆహారం వేయకూడదని.. నడకదారిలో హోటల్ నిర్వాహకులు చెత్తవేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. భద్రత కోసం డ్రోన్లను కూడా వాడాలని నిర్ణయించామని తెలిపారు. నడకదారిలో ఇరువైపులా ఫెన్సింగ్ వేద్దామంటే..అటవీశాఖ నిబంధనలు అడ్డొస్తున్నాయని పేర్కొన్నారు. 

Tags:    

Similar News