తిరుపతిలో ఉద్రిక్తంగా మారిన పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
Tirupati: టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Tirupati: టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీలోని పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను ప్రభుత్వ కార్పొరేషన్‌లో కలపాలంటూ గత 14 రోజులుగా ఎఫ్‌ఎంఎస్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేకుండా పోయిందని.. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన టైం స్కేల్ హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. అయితే టీటీడీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు కార్మికులు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి, పోలీస్ గ్రౌండ్‌కు తరలించారు.