TTD Darshan For Senior Citizens : శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దు..భక్తులకు టీటీడీ సూచన
TTD Darshan For Senior Citizens :
TTD Darshan For Senior Citizens: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అనేక దేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ముక్కులు తీర్చుకుంటారు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయం గోవింద నామాలతో మారుమోగుతూనే ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా ఆలయానికి సంబంధించిన ప్రతి సమాచారాన్నీ ముందుగానే తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జరుగుతన్న ఓ ప్రచారంపై టీటీడీ స్పందించింది
వృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మకూడదని భక్తులకు టీటీడీ విజ్నప్తి చేసింది. రోజూ వెయ్యిమంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ తెలిపింది. మూడు నెలల ముందే ప్రతినెలా 23న ఆన్ లైన్ కోటా విడుదల చేస్తున్నమంటూ పేర్కొంది. తిరుమలలో నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్, పీహెచ్ సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని టీటీడీ వెల్లడించింది. భక్తులు సరైన సమాచారాన్ని టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచించింది.
కాగా కొన్నాళ్ల క్రితం స్వామివారికి సమర్పించే అన్న ప్రసాదాల విషయంలోనూ ఇలాంటి మార్పులు జరిగాయని..ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలు వార్తలు వచ్చాయి. అన్న ప్రసాదం కోసం సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో ఉపయోగించిన బియ్యం వాడాలని టీటీడీ నిర్ణయించిందంటూ ఓ వార్త వైరల్ అయ్యింది. అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుందంటూ ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై స్పందించిన టీటీడీ..ఇవన్నీ అవాస్తవం అని టీటీడీ ఈవో జె.శ్యామల రావు ఓ ప్రకటనలో వెల్లడించారు.