TTD : తిరుమలకు వెళ్లే ప్లాన్‎లో ఉన్నారా..అయితే మీకు బిగ్ అలర్ట్..ఈ తేదీల్లో దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకో ముఖ్యమైన గమనిక. ఎందుకంటే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఏ ఏ తేదీల్లో ఇవి అందుబాటులో ఉండవో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-08-23 02:43 GMT

TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ..ఇవీ ప్రత్యేకతలు

Tirumala Tirupati: తిరుమలకు వెళ్లేందుకు మీరు రెడీగా ఉన్నట్లయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. లేదంటే వెళ్లిన తర్వాత ఇబ్బందుల్లో పడుతారు. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి నావాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్బంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను, పలు ప్రత్యేక దర్శనాలను అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తరలివస్తారు. ఈనేపథ్యంలో వారికి దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ దర్శనాలు, పలు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీనిలో భాగంగానే అక్టోబర్ 3వ తేదీ అంకుర్పాణం నుంచి 12వ తేదీ చక్రస్నానం వరకు ప్రతిరోజూ వయో వ్రుద్దులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు దర్శనం రద్దు చేసింది.

విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని తెలిపింది. మీరు తిరుపతికి వెళ్లే ప్లాన్ ఉన్నట్లయితే ఈ విషయాన్ని గమనించి వెళ్లాలి. లేదంటే అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Tags:    

Similar News