TTD alert on corona pandemic: కరోనా వేళ టీటీడీ మరింత అప్రమత్తం

TTD alert on corona pandemic:కరోనా వేళ మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించేందుకు తిరుపతి, తిరుమల దేవస్థానం అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

Update: 2020-06-30 03:37 GMT

TTD alert on corona pandamic: కరోనా వేళ మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించేందుకు తిరుపతి, తిరుమల దేవస్థానం అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిలిపివేసిన దర్శనాలను తిరిగి ప్రారంభించడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది విధుల్లో ఉండగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరికి రోజూ కరోనా టెస్టులు నిర్వహించడమే కాకుండా, ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనున్నారు.

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరుమలలో దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా నేపథ్యంలో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులకు క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు రోజుకు వంద టెస్ట్‌లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. ఇక ఈ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా బర్డ్ ఆసుపత్రిని కరోనా రోగులకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని అనిల్ పేర్కొన్నారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు వారం రోజులు ఒకేచోట విధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News