కాసేపట్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

* పార్టీ సభ్యత్వం, ప్లీనరీ, రాష్ట్ర కమిటీలపై చర్చ * అధ్యక్ష ఎన్నికలపై చర్చించనున్న కమిటీ * రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Update: 2021-02-07 08:10 GMT

Representational Image

కాసేపట్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం, ప్లీనరీ సమావేశాలు, సంస్థాగత పునర్నిర్మాణంపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​అధ్యక్షతన సమావేశం కానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీ నియామకంపైనా చర్చ జరగనుంది. ప్లీనరీ సమావేశాల అజెండా, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తదితర అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో రానున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలపైనా కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఇటీవల కొందరు పార్టీ నేతల వైఖరి వివాదాస్పదంగా మారుతున్నందున కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక కేటీఆర్‌ త్వరలో సీఎం అవుతారని పార్టీలో సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు తీవ్ర చర్చనీయాంశంగా మారినందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ అంశంపై కూడా స్పష్టత ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Tags:    

Similar News