Alert: ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నాయా.. జాగ్రత్త చాలా పెద్ద నష్టం..!

Alert: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఈ వార్త మీ కోసమే.

Update: 2022-03-21 01:30 GMT

Alert: ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నాయా.. జాగ్రత్త చాలా పెద్ద నష్టం..!

Alert: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఈ వార్త మీ కోసమే. బహుళ బ్యాంక్ ఖాతాలతో మీరు పెద్ద ఇరకాటంలో పడుతారు. ఆర్థిక నష్టాలతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక నిపుణులు కూడా ఒకే ఖాతాను మెయింటెన్‌ చేయాలని సూచిస్తారు. ఒకే బ్యాంకు ఖాతా కలిగి ఉండటం వల్ల రిటర్న్‌లు దాఖలు చేయడం కూడా సులభం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

మీకు చాలా బ్యాంకులలో ఖాతాలుంటే మొదటి నష్టం మెయింటనెన్స్‌. వాస్తవానికి ప్రతి బ్యాంకుకు దాని సొంత ప్రత్యేక నిర్వహణ ఛార్జీ, డెబిట్ కార్డ్ ఛార్జీ, SMS ఛార్జ్, సర్వీస్ ఛార్జ్, మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జ్ ఉంటాయి. అంటే మీకు ఎన్ని బ్యాంకులలో ఖాతాలున్నాయో వాటన్నిటి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే బ్యాంకులు భారీ ఛార్జీలను వసూలు చేస్తాయి.

ఒకే బ్యాంకు ఖాతా ఉంటే రిటర్న్ దాఖలు చేయడం సులభం

పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీకు ఒకే బ్యాంకు ఖాతా ఉంటే రిటర్న్‌లను దాఖలు చేయడం సులభం. ఎందుకంటే మీ సంపాదనకు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే ఖాతాలో అందుబాటులో ఉంటుంది. వేర్వేరు బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండటం వల్ల ఈ గణన కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో కొత్త విధానాన్ని ప్రకటించారు.

ఖాతా నిష్క్రియంగా ఉంటుంది

ఒక సంవత్సరం పాటు సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతాలో ఎలాంటి లావాదేవీ జరగకపోతే అది ఇన్‌యాక్టివ్ బ్యాంక్ ఖాతాగా మారుతుంది. రెండేళ్లపాటు లావాదేవీలు జరగకపోతే అది డోర్మాంట్ ఖాతా లేదా ఇన్‌ఆపరేటివ్‌గా మార్చుతారు. అటువంటి బ్యాంకు ఖాతాతో మోసం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆ ఖాతా వివరాలు ప్రత్యేక లెడ్జర్లో చేర్చుతారు.

ప్రైవేట్ బ్యాంక్ అదనపు ఛార్జీలు

ప్రైవేట్ బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీ చాలా ఎక్కువ. ఉదాహరణకు HDFC బ్యాంక్ కనీస నిల్వ 10 వేల రూపాయలు. గ్రామీణ ప్రాంతాలకు 5000 రూపాయలు. ఈ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు త్రైమాసికానికి జరిమానా రూ.750. ఇతర ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఇలాంటి ఛార్జీలు వర్తిస్తాయి. పొరపాటున మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే అనవసరంగా ప్రతినెలా వందల రూపాయలు చెల్లించాల్సి రావచ్చు. ఇది మీ CIBIL స్కోర్‌ని కూడా ప్రభావితం చేస్తుంది.

Tags:    

Similar News