భక్తులకి మరో శుభవార్తని అందజేసిన టీటీడీ

భక్తులకి టీటీడీ మరో శుభవార్తను అందజేసింది. రూ. 200కి విక్రయిస్తున్న పెద్దలడ్డు ధరని సగానికి తగ్గించింది. ఇకపై ఈ లడ్డూను రూ.100కే విక్రయించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Update: 2020-05-22 02:32 GMT

భక్తులకి టీటీడీ మరో శుభవార్తను అందజేసింది. రూ. 200కి విక్రయిస్తున్న పెద్దలడ్డు ధరని సగానికి తగ్గించింది. ఇకపై ఈ లడ్డూను రూ.100కే విక్రయించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా చిన్నలడ్డులో కుడా ధరను తగ్గించింది. ఇప్పటివరకు చిన్నలడ్డును రూ.50 కి విక్రయిస్తుండగా దానిని కూడా సగానికి తగ్గించేసి రూ. 25కి విక్రయించనున్నారు. ఇక వడ ధర మాత్రం ఎప్పటిలాగే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

కరోనా ప్రభావం వలన తిరుమలలో భక్తులకి అనుమతి ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే... కానీ ఆదాయం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.. రెండు నెల్లలో రూ.1.98 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ఇందులో ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే వచ్చిందని అయన స్పష్టం చేశారు. ఇ-హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు వచ్చిందని అయన స్పష్టం చేశారు. లాక్ డౌన్ వలన భక్తుల కోరిక మేరకు లడ్డూ ప్రసాదాల వితరణ మాత్రం కొనసాగుతోందని అన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణకి గాను కేంద్రప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ని మే31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.. అయితే సడలింపులో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ భక్తులను ఆలయాల దర్శనాలను కూడా అనుమతిస్తారని అందరు అనుకున్నారు. అందులో భాగంగానే టీటీడీ కూడా దీనికి తగు ఏర్పాట్లు కూడా చేసిందని సమాచారం. కానీ మే 31 వరకు అన్ని ఆలయాలను మూసివేయాలని కేంద్రం స్పష్టం చేయడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడింది.  

Tags:    

Similar News