Tirumala: రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. జూలై నెలలో ఎంతొచ్చిందంటే..!

Tirumala: తిరుమలేషుడిని క్షణం పాటు దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి కోరిన కోరికలు తీరుతాయని శ్రీ వారి భక్తుల విశ్వాసం.

Update: 2022-08-01 08:01 GMT

Tirumala: రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. జూలై నెలలో ఎంతొచ్చిందంటే..!

Tirumala: తిరుమలేషుడిని క్షణం పాటు దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి కోరిన కోరికలు తీరుతాయని శ్రీ వారి భక్తుల విశ్వాసం. అందుకే ఆ దేవదేవుని దర్శనార్ధం వచ్చే భక్త జనం రోజు రోజుకు పెరగడమే కాకుండా స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలు సైతం రికార్డ్ స్థాయిలో పెరిగాయి. తాజాగా జూలై నెలలో శ్రీవారి హుండి ఆదాయం అత్యధికంగా నమోదు అయింది. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారికి 139.45 కోట్ల హుండి ఆదాయం వచ్చి చేరింది. దీంతో వరుసగా ఐదో నెల 100 కోట్లు దాటి శ్రీవారి హుండి ఆదాయం నమోదు అయింది.

మార్చిలో రూ.128 కోట్లు, ఏప్రిల్ లో రూ.127.5 కోట్లు, మే నెలలో రూ.130.5 కోట్లు, జూన్ లో రూ.123.76 కోట్ల ఆదాయం రాగా.. జూలై నెలలో రూ.139.45 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నాలుగు నెలల్లో కలిపి మొత్తం రూ.649.21 కోట్ల ఆదాయం వచ్చింది. వరుసగా ఐదు నెలలు శ్రీవారి ఆదయం రూ.100 కోట్ల మార్క్ దాటింది. జూలై 4వ తేదీన ఒక్క రోజే ఏకంగా రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది.

Tags:    

Similar News