Tirumala News: శ్రీవారికి కాసుల వర్షం..జులైల రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం
Tirumala News: ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారం హుండీ ఆదాయం వచ్చింది. 30కి చేరువలో ఆ రికార్డ్ ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TTD NEWS: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చే భక్తులు ఆపద మొక్కులవాడికి ముడుపు కట్టి..ఆ ముడుపునుల తమ తాహతుకు తగ్గట్లుగా హుండీలో కానుకలను సమర్పిస్తారు. భక్తుల చిల్లర నాణేల నుంచి విలువైన బంగారు ఆభరణాల వరకు స్వామి వారి హుండీలో సమర్పిస్తారు. ఇలా భక్తులు వేసిన కానుకలతో హుండీ ఆదాయం దాదాపు రోజుకు 8 నుంచి 12సార్లు నిండిపోతుంది. నిండిన హుండీని భక్తుల సమక్షంలోనే సీలో వేసిన పరకామణి మండపానికి తరలించి అక్కడే స్వామి వారి హుండీ లెక్కింపు జరుగుతుంది.
కాగా జులై మాసంలో తిరుమల భక్తజనంతో నిండిపోయింది. విశేష పర్వదినాల్లో కనిపించే భక్తుల రద్దీ జులై మాసం మొత్తం ఉంది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం విచ్చేసారు. లక్షకు పైగా భక్తులు తిరుమలకు ప్రతినిత్యం చేరుకుంటారు. రద్దీకి అనుగుణంగా అదే స్థాయిలో శ్రీవారి హుండలో కానుకలను కూడా సమర్పిస్తుంటారు. గత 29 నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం వద్ద కోట్ల మార్క్ దాటుతోంది. గతేడాది జనవరి 2వ తేదీ రూ. 7.68కోట్లు వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న హుండీ ఆదాయం ఇదే మొదటిది. 2022 అక్టోబర్ 23వ తేది హుండీ ఆదాయం రూ: 6.31 కోట్లు .ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం జులై-27-2018లో రూ: 6.28 కోట్ల రూపాయలు హుండీ ఆదాయంగా ఉంది.
ఇప్పటి వరకు ఇదే రికార్డ్. అంతకు ముందు 2012-జనవరి-1వ తేదీ రూ: 4.23 కోట్ల రూపాయలు రికార్డ్ క్రియేట్ అయ్యింది. అదే ఏడాది 2012-ఏప్రిల్-1వ తేదీ రూ: 5.73 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించగా... జూలై మాసంలో రికార్డ్ స్థాయిలో భక్తులు హుండీ కానుకలు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు నమోదైన హుండీ ఆదాయాల్లో ఇదే అత్యధికమని టీటీడీ రికార్డ్స్ అంటున్నాయి . ముడుపులు రూపంలో స్వామి వారికి 125 కోట్లు భక్తులు కానుకలుగా సమర్పించగా.. వరుసగా 29వ నెల 100 కోట్ల మార్క్ ని దాటడం మరో విశేషంమని అధికారులు చెబుతున్నారు.