TTD Tickets: భక్తులకు అలర్ట్..నేడు డిసెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు రిలీజ్.. పూర్తి వివరాలివే

Tirumala Tickets: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్. మీరు తిరుమల వెళ్లాలనే ప్లాన్ లో ఉంటే ఈ విషయం మీకోసమే. డిసెంబర్ నెలలో స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవాస్థానం నేడు విడుదల చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-09-18 02:46 GMT

 TTD Tickets: భక్తులకు అలర్ట్..నేడు డిసెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు రిలీజ్.. పూర్తి వివరాలివే

Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారికి దర్శనానికి ప్లాన్ చేస్తున్న భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను నేడు ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ ద్వారా విడుదల చేయనుంది. డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం నేడు టీటీడీ ఉదయం రూ. 300 టికెట్ల 24 ఉదయం 10గంటలకు మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను రిలీజ్ చేస్తుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10గంటల వరకు భక్తులు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీడిప్ లో టికెట్లు మంజూరు అవుతాయి.

ఇక ఈనెల 21వ తేదీన ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపకాలంకార సేవ టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు తెలిపింది. వర్చువల్ సేవా టికెట్లను కూడా అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు రిలీజ్ చేస్తారు. 23వ తేదీన అంగప్రదక్షిణ టోకెన్లను ఉదయం 10గంటలకు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ టికెట్లను ఉదయం 11గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మధ్యాహ్నం 3గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఫ్రీ స్పెషల్ దర్శన టోకెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.

ఈ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ కు వెళ్లి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇందులో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలి.


Tags:    

Similar News