TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..నేడు ఆర్జితసేవ, కల్యాణం సేవల టికెట్లు విడుదల
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతోపాటు మరికొన్ని సేవలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఈరోజు విడుదల చేయనుంది. టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు ఈ వివరాలు తెలుసుకోండి.
TTD: తిరుమల శ్రీవారిని అన్ని సేవలలో దర్శించుకునే భాగ్యం టీటీడీ కల్పిస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు అంటే సోమవారం ఉదయం 10గంటలకు అనేక సేవా టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. దీనిలో భాగంగానే సోమవారం నాడు అక్టోబర్ కోటాకు సంబంధించిన శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత సేవ, బ్రహ్మోత్సవం టికెట్లతో పాటు అక్టోబర్ 2024 నెల కోటాకు సంబంధించి సహస్ర దీపాలంకరణ, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ వెబ్ పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి. శ్రీవారి భక్తులు ఈ సేవల టికెట్లను పొందవచ్చని టీటీడీ పేర్కొంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను టీటీడీ ఆన్ లైన్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సేవాటికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జులై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీడీప్ లో టికెట్లను మంజూరు చేస్తారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జులై 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నారు. వాటి దర్శన స్లాట్లకు సంబంధించి అక్టోబర్ నెల కోటాను జులై 22న మధ్యాహ్నం 3గంటలకు టీటీడీ ఆన్ లైన్లో రిలీజ్ చేయనుంది.
అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్ల కోటాను జులై 23న ఉదయం 10గంటలకు విడుదల చేస్తుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి అక్టోబర్ నెల ఆన్ లైన్ కోటాను జులై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబర్ నెల ఫ్రీ స్పెషల్ దర్శనం టికెట్లకోటాను జులై 23వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.