తిరుమల వెళ్లే భక్తులకు గమనిక.. ముందు వచ్చిన వారికి ముందు అనే..
Tirumala: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
Tirumala: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. టికెట్లు పొందిన వారి జాబితాను నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 46,470 టిక్కెట్‌లలో, లక్కీ డిప్ సేవా టిక్కెట్లు 8070 భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు ఉన్నాయని తెలిపింది టీటీడీ.
ఆర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు ఈరోజు ఉదయం 10 నుండి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ సూచించింది. ఆన్‌లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టిక్కెట్‌ల నిర్ధారణ చేయబడుతుంది. టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు.