Manyam District: మన్యం జిల్లా బుచ్చింపేటలో పులిసంచారం

* గ్రామ సమీపంలోని జాంతికొండపై పులి సంచరిస్తున్నట్లు స్థానికుల వెల్లడి

Update: 2022-11-23 05:19 GMT

మన్యం జిల్లా బుచ్చింపేటలో పులిసంచారం

Tiger Hulchul: మన్యం జిల్లా పార్వతిపురం బుచ్చింపేటలో పులిసంచారం కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి పశువుల కొట్టంలో ఉన్న ఆవుపై దాడి చేసిన పులి సమీపంలోని తోటలోకి తీసుకెళ్లింది. నిన్న సాయంత్రం మేకలమందపై దాడిచేసి మేకను ఎత్తుకెళ్లింది. పులి సంచారంపై అటవీశాఖ అధికారులక గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. గ్రామ సమీపంలో ఉన్న జాంతి కొండపై పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పులి అడుగులను పరిశీలించిన అటవీశా‌ఖ అధికారులు పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. 

Tags:    

Similar News