Sankranthi Special: చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు
* పలు ప్రాంతాల్లో భోగికి ముందే జల్లికట్టు నిర్వహణ * మొన్న చంద్రగిరి మండలంలో నేడు రామచంద్రాపురంలో.. * ముందే మొదలైన జల్లికట్టు సందడి
చిత్తూరు జిల్లాలో సాంప్రదాయ జల్లికట్టు ఆట ప్రారంభమైంది. కనుమ రోజు నుంచి మొదలయ్యే జల్లుకట్టును ఈసారి భోగికి ముందే స్టార్ట్ చేశారు. మొన్న చంద్రగిరి మండలం కొత్తశానం బట్లలో జల్లికట్టు నిర్వహించారు. నేడు రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జల్లికట్టును వేడుకగా ప్రారంభించారు. జల్లికట్టులో పాల్గొనేందుకు యువకులు భారీగా తరలివస్తున్నారు. అనుప్పల్లి, బ్రాహ్మణపల్లి, నెమలిగుంటపల్లి, ఉప్పులవంక, గంగిరెడ్డిపల్లి, యాపకుప్పం, చంద్రగిరి, చానంబట్ల, పాతచానంబట్ల, చవటగుంట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వృషభరాజులను తీసుకువస్తున్నారు. దీంతో ఆయా గ్రామాలు సందడిగా మారాయి.