ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడును విజయవాడలోని ఏసీబీ ఆఫీసుకు తీసుకువచ్చారు అధికారులు. అనంతరం ఆయనకు వైద్యపరీక్షల కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటలకు అచ్చెన్నాయుడు సహా మిగిలిన ఐదుగురు నిందితులను జడ్జి ముందు హాజరుపరచనున్నారు. అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఈఎస్ఐ ఆసుపత్రి వద్దకు కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.
దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది పోలీస్ శాఖ. టీడీపీ నేతలు, కార్యకర్తలెవ్వరిని అనుమతించలేదు. కాగా మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫిబ్రవరి నెలలో నివేదికను బయటపెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా అచ్చెన్నాయుడిని శుక్రవారం ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.