Tdp leader btech ravi resigns : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా

Update: 2020-07-31 15:54 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన నేపథ్యంలో అందుకు నిరసనగా టీడీపీ నేతలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లుల ఆమోదానికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్‌ రవి) తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపుతానని అన్నారు. ఇకనుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మాత్రమే పనిచేస్తానంటూ బీటెక్ రవి వెల్లడించారు. మండలి ఆమోదించని బిల్లులు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలకు గౌరవం, ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు. కాగా కడప జిల్లా పులివెందులకు చెందిన బీటెక్ రవి టీడీపీలో కీలకంగా ఉన్నారు.

ఇదిలావుంటే ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ, లెజిస్లేచర్ క్యాపిటల్ గా అమరావతి, జ్యుడీషియల్‌ క్యాపిటల్ గా కర్నూలు ఉండనున్నాయి. జనవరి 20న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపగా. శాసనమండలిలో మాత్రం ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో ఈలోపు శాసనమండలిని రద్దు చేస్తూ కూడా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన గవర్నర్ శుక్రవారం ఆమోదముద్ర వేశారు.    

Tags:    

Similar News