Pitani Venkata Suresh Bail Petition Dismiss by HC: మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్
Pitani Venkata Suresh Bail Petition Dismiss by HC: ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కు షాక్ తగిలింది.
Pitani Venkata Suresh Bail Petition Dismiss by HC: ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కు షాక్ తగిలింది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. సురేష్ తోపాటు మరో ఇద్దరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. కాగా ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టు చేస్తారనే ఆలోచనతో పితాని కుమారుడు వెంకట సురేష్, పితాని పీఎస్ మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పితాని పీఎస్ మురళీమోహన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఈ కేసులో ఆయనను ప్రశ్నించారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోలు గోల్‌మాల్‌పై అధికారులు ప్రశ్నలు సంధించారు. సిఫార్స్ లేఖపై కూడా ఆయనను ప్రశ్నించారు. ఇదిలావుంటే ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను ఇటీవల కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టిన సంగతి తెలిసిందే.. అధికారులు చెబుతున్న దాని ప్రకారం గత ఆరేళ్లలో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు.