నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంపై సుప్రీం విచారణ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై నేడు(గురువారం) సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ వేసింది.

Update: 2020-06-18 07:14 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై నేడు(గురువారం) సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ వేసింది. పిటిషన్‌లో ప్రతివాదిగా నిమ్మగడ్డ పేరును చేర్చారు. ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్ విషయంలో పట్టుదలగా ఉంది.

ఈ క్రమంలో సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో అప్పుడు కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కోల్పోయారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

Tags:    

Similar News