Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్‌

Supreme Court: పోలవరం ప్రాజెక్టు నష్ట పరిహారం మినహా.. ఎన్జీటీ తీర్పును యధాతథంగా ఉంచాలన్న సుప్రీం

Update: 2022-10-17 11:52 GMT

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్‌

Supreme Court: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. పోలవరం, పురుషోత్తమపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌-ఎన్‌జీటీ విధించిన.. 4 కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఏపీ సర్కారును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులోని ఇతర అంశాలను పూర్తిగా అమలు చేయాలని.. కేవలం నష్ట పరిహారం అంశంపై మాత్రమే విచారణను కొనసాగిస్తామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జేకే మహేశ్వరి ధర్మాసనం తెలిపింది.

పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయని ఇటీవల నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌ తెలిపింది. అందుకు భారీగా జరిమానాలను విధించింది. దీనిపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. తాజాగా వివాదంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీ సంయుక్త కమిటీ సిఫారసులను యధాతథంగా అమలు చేయల్సిందేని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News